తోడబుట్టిన సోదరి లేదని..
Writing the AI summary…
షాజహాన్‌పూర్: తోడబుట్టిన అక్కాచెల్లెళ్లు లేరు. ఆ లోటును పూరించడానికి 101 మంది యువతులకు అన్నగా మారారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినయ్ అగర్వాల్. దగ్గరుండి వారందరికీ సామూహిక వివాహాలు జరిపించారు. అంతేకాదు.. ఉత్తి పెళ్లి చేసి చేతులు దులుపుకోలేదు.. పెట్టిపోతలు, చీరసారెలు అన్నీ పెట్టి ఘనంగా వేడుక నిర్వహించారు. యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన వినయ్ అగర్వాల్ వ్యాపారవేత్త. ఆయనకు తోడబుట్టిన సోదరి లేదు. ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఎన్నో.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments