సంస్కృతికి ప్రతీక.. అలయ్ బలయ్
Writing the AI summary…
ఆలేరురూరల్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అలయ్ బలయ్ కార్యక్రమం అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆదివారం బండ్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి నేతృత్వలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఒకచోట చేరి ఆత్మీయతను పంచుకోవడం, పరస్పర స్నేహభావాన్ని పెంపొందించుకోవడమే అలయ్ బలయ్ అని పేర్కొన్నారు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments