Arts & Culture Sakshi about 2 hours ago

భావోద్వేగంలో పుట్టిన వాక్యమే కవిత్వం

Writing the AI summary…

పెద్దవూర : భావోద్వేగాలున్న ప్రతి వ్యక్తి కవి అవుతాడని, భావోద్వేగంలో పుట్టిన వాక్యమే కవిత్వం అవుతుందని ప్రముఖ కవి విమర్శకులు ఆర్‌.సీతారాం అన్నారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని బుద్ధవనంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి యూత్‌ లిటరరీ ఫెస్ట్‌–2026 రెండవ రోజు ఆదివారం ఆయన మాట్లాడారు. ఒకే కవిత్వం పాఠకులను అనుసరించి పలు విధాలుగా గోచరిస్తుందని పేర్కొన్నారు. కవి విమర్శకులు బీవీ.స్వామి మాట్లాడుతూ కథలు రాయడమంటే సమాచారం ఇవ్వడం కాదని సృజనాత్మకంగా చెప్పే నేర్పును రచయితలు సాధించాలని సూచించారు.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.