తొండవాడ ముక్కోటి ఉత్సవాలు ప్రారంభం
Writing the AI summary…
తొండవాడ: చంద్రగిరి మండలం తొండవాడలోని ముక్కోటి క్షేత్రంలో రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం చుట్టారు.ఉత్సవాల ప్రారంభ సూచికగా శనివారం ఉదయం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ మహాగణపతి హోమం నిర్వహించి, శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments