మిచిగన్‌లో ఘనంగా జీటీఏ డెట్రాయిట్ చాప్టర్ బతుకమ్మ, దసరా వేడుకలు
Writing the AI summary…
ఫార్మింగ్టన్ హిల్స్ (అమెరికా): అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరిశాయి. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో నాలుగోసారి నిర్వహించిన బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. స్టూడియో సెంటర్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 1,800 మంది తెలుగు ప్రవాసులు పాల్గొన్నారు. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతకు ఈ వేడుకలు ప్రతీకగా నిలిచాయి.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments