IND vs ZIM: చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్.. మిథాలీ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్
Writing the AI summary…
వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ వెంటవెంటే ఔట్ కావడంతో టీమిండియా కేవలం 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments