కాళింగమర్ధనంపై గోవిందుడు
Writing the AI summary…
శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం కాలింగమర్ధన సేవ నిర్వహించారు. గోవిందా నామస్మరణతో మాఢవీధులు మారుమోగాయి. కాళింగమర్ధనంపై విచ్చేసిన దేవదేవుడికి భక్తులు మంగళహారతులతో నీరాజనం పలికారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు ఉప్పల విఠల్‌రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్‌గౌడ్, అర్చక స్వాములు కృష్ణమాచారి, నవీన్‌చారి, వర్ధనాచారి, సుకుమారాచారి పాల్గొన్నారు. – సిరిసిల్లటౌన్
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments