ఇంద్రగిరి.. భక్త ఝరి
Writing the AI summary…
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. అంతరాలయం, ఇంద్రకీలాద్రి, కనకదుర్గానగర్ ఇలా అన్ని చోట్లా భక్తజన సందోహం కనిపిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీమహిషాసుర మర్దినీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments